![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -483 లో.. కృష్ణకు జాగ్రత్తలు చెప్పిన భవాని అక్కడి నుండి ఇంటికి వచ్చేస్తుంది. తను కృష్ణలో టెన్షన్ మొదలవుతుంది. మురారీ నుంచి ఫోన్ రాకపోవడంతో కాస్త కంగారుపడుతుంటుంది. కాసేపటికి కృష్ణ వాళ్ళ ఇంటిముందు కారు ఆగుతుంది. మురారి అనుకున్న కృష్ణ సంబరంగా నవ్వుకుంటు అక్కడికి వచ్చేస్తుంది. అయితే ఆ కారులోంచి మురారీ కాకుండా ముకుంద దిగుతుంది. నవ్వుతూ దగ్గరకు వెళ్లి.. ఎలా ఉన్నావ్ కృష్ణా అని ముకుంద అంటుంది. నువ్వు ఎందుకొచ్చావని కృష్ణ కోపంగా అనగానే.. నీ కోసమే ఇంత దూరం ప్రయాణం చేసి వస్తే ప్రయాణం ఎలా జరగింది.. మంచినీళ్లో.. మజ్జిగో తాగుతావా అని అనడకుండా.. ఎందుకొచ్చావేంటని అడుగుతావేంటి కృష్ణ అని ముకుంద అంటుంది. మళ్లీ అడుగుతున్నాను.. ఎందుకొచ్చావ్ అని కృష్ణ కోపంగా. చెప్పాను కదా కృష్ణా.. నీ కోసమే.. అక్కడ నా వల్ల టెన్షన్ భరించలేక.. ఇక్కడ ప్రశాంతంగా ఉండొచ్చని వచ్చావు.. మరి నిన్ను ఎలా ప్రశాంతంగా ఉండనిస్తాను చెప్పమని ముకుంద అంటుంది.
నువ్వు ఎప్పుడైతే ముకుంద అని తెలిసిందో.. అప్పుడే ప్రశాంతత మొత్తం పోయింది. ఇంకే మిగిలిందని వచ్చావని కృష్ణ అనగానే.. నా మురారి ఇంకా నీ దగ్గరే ఉన్నాడు కదా.. తనని నా సొంతం చేసుకునే వరకూ నాకు మనశ్శాంతి ఉండదు కదా.. అసలు నువ్వు నా మురారి ఇంట్లో గనుక ఉండి ఉంటే ఈ పాటికి నేను అనుకున్నది జరిగిపోయేదని అంటుంది. ఏం జరిగి ఉండేదని కృష్ణ అడుగగా... కృష్ణా.. ఉండి ఉంటే తెలిసి ఉండేదిలే అని ముకుంద అంటుంది. ఇంతకీ మురారీ ఎక్కడా అని ముకుంద అడుగగా.. ఏసీపీ సర్ ఏదో పని మీద వెళ్లారని పెద్దత్తయ్య చెప్పారు.. ఈ విషయం ముకుందకు తెలిసినట్లు లేదు. ఇక్కడే ఉన్నారని వచ్చినట్లు ఉందని కృష్ణ మనసులో అనుకుంటుంది. ఆయన గురించి నీకెందుకని కృష్ణ కోపంగా అడిగేసరికి.. అరే నీకెందుకు? ఏం మాట్లాడుతున్నావ్ కృష్ణా.. ఏం చేసినా ఎన్నిపాట్లు పడినా మురారి కోసమే కదా.. తెలియనట్లే అడుగుతున్నావేంటని ముకుంద అంటుంది. కాసేపటికి వాళ్ళ దగ్గరికి శాంకుతల వస్తుంది. మీరాని చూసి.. ఎవరు కిట్టమ్మా ఈమె అని శకుంతల అనగానే.. తను మీరా.. నా ఫ్రెండ్.. నన్ను చూడటానికి వచ్చిందని కృష్ణ అబద్ధం చెప్తుంది. హో.. అవునా అని శకుంతల నవ్వుతుంది. అవునండి ఫ్రెండ్స్ అంటే మామూలు ఫ్రెండ్స్ కాదు.. ప్రాణ స్నేహితులమని మీరా అంటుంది.
మరోవైపు ఇంటికి చేరిన భవాని ఆదర్శ్ దగ్గరకి వెళ్తుంది. మారవారా నువ్వు.. ఆవేశమే తప్ప ఆలోచనే ఉండదా నీకు? మీరాని ఎందుకు చంపాలనుకున్నావ్.. సమయానికి రేవతి వచ్చి ఆపింది కాబట్టి సరిపోయింది. లేదంటే నేను పోలీసుల చుట్టు.. కోర్టు చుట్టూ తిరుగుతూ ఉండేదాన్ని. అయినా ఎందుకురా నీకు అంత ఆవేశమని ఆదర్శ్ ని భవాని తిట్టేస్తుంది. మరోవైపు మీరా లోపలికి వెళ్లాక.. ప్రభాకర్, శకుంతల ఇద్దరు కూర్చోబెట్టుకుని.. ముకుంద ముందు ముకుందనే తిట్టడం స్టార్ట్ చేస్తారు. మా కృష్ణ చాలా తింగరిది.. పాపం తనకేం తెలియదు.. గతంలో వాళ్లింట్లో ఒక అమ్మాయి ఉండేది.. ముకుందా అని. తను మా అల్లుడు మీద కన్నేసింది. చాలా ఇబ్బందులు పెట్టింది. తను మాత్రం చచ్చిపోయి బతికింది. లేదంటే చంపేసేవాళ్లమటూ నోటికి వచ్చినట్లు శకుంతల, ప్రభాకర్ తిడతారు. ఆ మాటలు వినలేక ముకుంద ఇబ్బంది పడుతుంది. ఇక కృష్ణ మాత్రం నవ్వుకుంటుంది. కాసేపటికి ఇద్దరూ కలిసి అక్కడ నుండి ఇంటికి బయలుదేర్తారు. మరోవైపు మురారి గురించి భవాని ఆలోచిస్తూ టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |